FOLLOW THESE STEPS FOR TO CHECK EPF BALANCE WITHOUT UAN NS GH
EPF Balance Without UAN: యూఏఎన్ నంబర్ లేకున్నా మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే?
ప్రతీకాత్మక చిత్రం
ఇప్పటి వరకు ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే UAN నంబర్ తప్పనిసరిగా అవసరం ఉండేది. కానీ, ఇక నుండి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) లేకుండానే బ్యాలెన్స్ చెక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది.
పీఎఫ్ పెట్టుబడులను మరింత పారదర్శకంగా చేయడానికి ఇటీవలి కాలంలో, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపిఎఫ్ఓ) పలు సవరణలు చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా, ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకునేందుకు ఈపిఎఫ్ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే UAN నంబర్ తప్పనిసరిగా అవసరం ఉండేది. కానీ, ఇక నుండి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) లేకుండానే బ్యాలెన్స్ చెక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. తద్వారా మీ UAN నెంబర్ మీకు గుర్తుకు లేకపోయినా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-229014016 కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఈ సౌకర్యాన్ని పొందేందుకు మీరు ముందుగానే UAN పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. అంతేకాక, మీ KYC వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఈ క్రింది ప్రక్రియ ఫాలో అవ్వండి.
UAN లేకుండా PF బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి..
స్టెప్ 1: ఈపీఎఫ్ఓ హోమ్ పేజీ epfindia.gov.in లాగిన్ అవ్వండి
స్టెప్ 2: మీ ఈపిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ‘క్లిక్ హియర్ టు నో యువర్ పీఎఫ్ బ్యాలెన్స్’ పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: వెంటనే epfoservices.in/epfo/ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ “మెంబర్ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్”ను ఎంచుకోండి.
స్టెప్ 4: అక్కడ మీ రాష్ట్రం, ఈపీఎఫ్ కార్యాలయం, కోడ్, పీఎఫ్ ఖాతా సంఖ్య, ఇతర వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 5:'సబ్మిట్’ చేసే ముందు‘ ఐ అగ్రీ’పై క్లిక్ చేయండి.
స్టెప్ 6: అప్పుడు మీ స్క్రీన్‌పై ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ప్రత్యక్షమవుతాయి.
కాగా, ఈ ప్రక్రియతోనే కాకుండా passbook.epfindia.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా కూడా మీ యుఎఎన్ నంబర్ లేకుండానే ఈపిఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు.
UAN నంబర్‌తో PF బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి..
ఈపిఎఫ్ఓ చందాదారుడికి UAN నంబర్ ఉంటే, అప్పుడు SMS లేదా మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899 కు EPFOHO UAN అని ఎస్ఎమ్ఎస్ పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పిఎఫ్ బ్యాలెన్స్ వివరాలను పంపిస్తుంది ఈపీఎఫ్ఓ సంస్థ.