APSSC INVITING APPLICATIONS FOR 300 JOBS IN AMARA RAJA GROUP HERE FULL DETAILS NS
Andhra Pradesh Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రముఖ కంపెనీలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. ఈ లింక్ తో రిజిస్టర్ చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ అమర రాజా గ్రూప్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అర్హతల వివరాలు..
ఈ ప్రకటన ద్వారా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు మిషన్ ఆపరేటర్ గా పని చేయాల్సి ఉంటుంది. టెన్త్ పాస్, ఇంటర్ పాస్/ఫెయిల్, ఐటీఐ పాస్/ఫెయిల్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్ల వయస్సు ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేయాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి నెలకు రూ. 10,500 వరకు వేతనం చెల్లించనున్నారు. Registration - Direct Link
ఇతర వివరాలు..
రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 11న వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. హెచ్ఆర్ రౌండ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి వారం పాటు ట్రైనింగ్ ఉంటుంది. అనంతరం చిత్తూరు జిల్లాలోని అమర రాజా గ్రూప్ లో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి సబ్సిడీపై భోజనం, రవాణా సదుపాయం కల్పించనున్నారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 824776609 నంబరును సంప్రదించాలని సూచించారు.