• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • VIRAL VIDEO UNKNOWN MAN DAMAGED RUPEES 8 CRORE PORSCHE CAR WITH ITS OWNER ORDER VIDEO GOES VIRAL ON SOCIAL MEDIA NK GH

Porsche: రూ.8 కోట్ల పోర్ష్ కారును నాశనం చేసిన వ్యక్తి... కారణం తెలిసి పోలీసులు షాక్

రూ.8 కోట్ల పోర్ష్ కారును నాశనం చేసిన వ్యక్తి (image credit - facebook)

Man smashes Porsche: కొన్నిసార్లు కొన్ని సంఘటనలు చూసినప్పుడు మనకు ఆశ్చర్యంగా, అనిపిస్తాయి. అలాంటి ఘటన కెంట్‌లోని డోవర్ సిటీలో జరిగింది. అదేంటో, ఎం జరిగిందో తెలుసుకుందాం.

  • Share this:



ర్యాన్ హ్యామ్ బ్రూక్ అనే వ్యక్తి... కెంట్ సిటీ డోవర్‌లోని ఫోక్ స్టోన్ రోడ్డుపై వెళ్తున్నాడు. బైక్‌పై వెళ్తుండగా ఓ వ్యక్తి పెద్ద సైజు రెంచ్ సాయంతో పోర్ష్ కారును నాశనం చేస్తూ కనిపించాడు. పోర్ష్ 911 మోడల్ అయిన ఆ కారు చాలా అందంగా ఉంది. దాన్ని అతను ఎందుకు నాశనం చేస్తున్నాడో అర్థ కాలేదు. బహుశా ఆ కారు తాలూకు ఓనర్‌కీ అతనికీ గొడవ అయ్యిందేమో... ఆ పగతో అలా చేస్తున్నాడేమో అనుకున్నాడు. దానిపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలనుకొని... వీడియో తీశాడు.

ఈ వీడియోలో రెండు పోర్ష్ కార్లు ఒకదాని వెనుక ఒకటి ఆగి ఉన్నాయి. ఫుట్ పాత్ నుంచి రెయిలింగ్ ఎక్కి వచ్చిన వ్యక్తి... దాదాపు రూ.8.21 కోట్ల విలువైన నలుపు రంగు పోర్ష్ కారు బానెట్‌ని నాశనం చేయసాగాడు. పక్కన ఫుట్ పాత్‌పై ఓ వ్యక్తి, ఓ మహిళ నిలబడి అతడు చేసే పనిని చూస్తున్నారు. ఆ రెండో వ్యక్తి... కారును నాశనం చేస్తున్న వ్యక్తిని ఆపకుండా అతడికి ఇంకా ఎక్కడెక్కడ కొట్టాలో వివరిస్తూ రెంచ్ ఇచ్చాడు. ఇలా కారును దాదాపు నిమిషం పాటు కొట్టి కొట్టి బానెట్‌ని పూర్తిగా నాశనం చేశాడు. ఆ తర్వాత ఆ వాహనం అలాగే రోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. ఆ వీడియో మీరే చూడండి.

ఈ ఘటన జరిగిన ఫోక్ స్టోన్ ఏరియా అక్కడి బెస్ట్ ఏరియాల్లో ఒకటి. అక్కడ అలాంటి ఘటనలు జరగడం అరుదు. ఇదంతా అయ్యాక... ర్యాన్... తన ఇంటికి వెళ్లిపోయాడు.

ఇది కూడా చదవండి:అమ్మాయిలు ఆ పువ్వును వాసన చూశారు. వీడియో తీశారు. ఇలా అవుతుందని ఊహించి ఉండరు

దీనిపై పోలీసులకు రిపోర్ట్ అందింది. దీని గురించి కెంట్ పోలీసులు మాట్లాడుతూ ఫోక్ స్టోన్ రోడ్డులో కారును ఎవరో డ్యామేజ్ చేసినట్లుగా మాకు కంప్లైంట్ వచ్చింది. మా ఆఫీసర్లు కేసు రాసి కారు యజమానిని కలిశారు. అతడు చెప్పిన విషయం విని వారంతా ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి స్వయంగా తన కారును డ్యామేజ్ చేయమని కోరాడట. డ్యామేజ్ చేసిన వ్యక్తిపై కేసు అవసరం లేదని చెప్పాడు. దాంతో అవాక్కవ్వడం పోలీసుల వంతైంది. ఇంతకీ కారును ఎందకు నాశనం చేయించిందీ... చెప్పేందుకు అతను ఆసక్తి చూపలేదు.


Published by:Krishna Kumar N
First published: