Supersonic fights: 1800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం.. ఎప్పటి నుంచి అంటే..

Supersonic fights: 1800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం.. ఎప్పటి నుంచి అంటే..

supersonic passenger flights

సూపర్​సోనిక్ ప్యాసింజర్ విమానాలు మళ్లీ గగనతలంలో విహరించనున్నాయి. మెరుపు వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నాయి.

  • Share this:
సూపర్​సోనిక్ ప్యాసింజర్ విమానాలు మళ్లీ గగనతలంలో విహరించనున్నాయి. మెరుపు వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నాయి. అమెరికాకు చెందిన ఎయిలైన్స్ సంస్థ ‘యునైటెడ్’ 15 సూపర్​సోనిక్ విమానాలను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. గతంలోనే సూపర్​సోనిక్ విమానాల్లో ప్రయాణాలు జరిగిన వివిధ సమస్యల కారణంగా 2003లో పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని సూపర్​సోనిక్​ ప్యాసింజర్ విమానాలు నడుపుతామని యునైటెడ్ చెబుతోంది.

ఈ కొత్త సూపర్​సోనిక్​ విమానాలను బూమ్ అనే సంస్థ తయారు చేస్తోంది. త్వరలోనే వీటి ట్రయల్ నిర్వహించనుంది. అన్ని రక్షణ ప్రమాణాలతో విమానాలను 2029 కల్లా ప్రారంభించాలని యునైటెడ్ నిర్ణయించుకుంది.సూపర్​సోనిక్ విమానాలు శబ్దవేగం కన్నా స్పీడ్​గా వెళతాయి. సాధారణ ప్యాసింజర్​ విమానం గంటకు సుమారు 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అదే బూమ్ తయారు చేస్తున్న సూపర్​సోనిక్ విమానం గరిష్టంగా గంటకు 1,805 వేగంతో వెళ్లగలదు. అలాగే 60వేల అడుగు ఎత్తులో ఎగరగలదు.

సూపర్​సోనిక్ విమానాల్లో ప్రయాణిస్తే న్యూయార్క్ నుంచి లండన్​కు ప్రస్తుతం వెళుతున్న సమయం కన్నా సగం టైమ్​లోనే ప్రయాణించవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ప్రతీ ట్రిప్​కు దాదాపు మూడున్నర గంటల సమయం ఆదా అవుతుందని బూమ్ సంస్థ చెప్పింది.

1976లో కాన్​కోర్డ్ అనే సంస్థ సూపర్​సోనిక్ ప్యాసింజర్ విమానాలను ప్రారంభించింది. ఇవి గంటకు గరిష్ఠంగా గంటకు 2180 కిలోమీటర్ల వెళ్లే సామర్థ్యం కలిగి ఉండేది. అయితే దాదాపు 50 ఏళ్లు నడిచాక వివిధ కారణాలతో ఈ విమానాలు పూర్తిగా నిలిచిపోయాయి.

సూపర్​సోనిక్​ విమానాలకు చాలా సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణ సమయంలో వీటి ద్వారా శబ్దం, గాలి కాలుష్యం అధికంగా జరుగుతుంది. స్పీడ్ పెంచే సమయంలో వీటి నుంచి వచ్చే శబ్దం బాంబు పేలుడులా ఉంటుంది. అందుకే బూమ్ కాస్త వేగాన్ని తగ్గించింది. అలాగే భూమికి దగ్గరగా ప్రయాణిస్తున్న సమయంలో తక్కువ వేగంతో ప్రయాణిస్తే సమస్య ఉండదని భావిస్తోంది. సముద్రాలపైన పెళ్లే సమయంలో టాప్​స్పీడ్​లో వెళ్లినా ప్రాబ్లమ్స్ రావని చెబుతోంది. అలాగే సాధారణ విమానాలు చేసేంత శబ్దమే చేసేలా సూపర్​సోనిక్ విమానాలను రూపొందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పింది. కాగా సూపర్ సోనిక్ విమానాలకు ఇంధనం కూడా చాలా ఎక్కువగా కావాలి. దీన్ని అధిమించేందుకు బయో డీజిల్​ను వినియోగించాలని బూమ్ సంస్థ భావిస్తోంది. అయితే ప్రస్తుతానికి బయో డీజిల్ డిమాండ్ మేరకు ఉత్పత్తి కాకపోవడమే తమకు సవాల్​గా మారిందని చెబుతోంది.
సూపర్​సోనిక్ విమానాల్లో టికెట్లు కూడా అధిక ధరతోనే ఉంటాయి. కాంకోర్డ్ విమానాలు నడిపిన సమయంలోనూ ఈ సమస్య వెంటాడింది. అయితే సూపర్​సోనిక్ విమానాలు నిలిచిపోయే ముందు కొన్ని సంవత్సరాలు వీటి ద్వారా బ్రిటీష్ ఎయిర్ లైన్స్​కు ఆదాయం బాగానే వచ్చింది. ఇప్పుడు బూమ్ కూడా అదే చెబుతోంది. ప్రస్తుతం విమానాల్లో ఉన్న బిజినెస్ క్లాస్​ టికెట్​ ధరలకు దగ్గరగానే.. సూపర్ సోనిక్ విమానాల టికెట్ రేట్లు ఉండొచ్చని వెల్లడించింది.
Published by:Rekulapally Saichand
First published: