అయ్యో.. ఎంత పని చేశావ్ తల్లి.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో..

శివశంకర్, జోస్నా.. వారి కుమారులు

తల్లులకు పిల్లలే ప్రపంచం. వారిని చూసుకునే మురిసిపోతారు. కానీ ఓ తల్లి ఇద్దరు పిల్లల్ని చంపి.. తాను ఆత్మహత్యకు యత్నించింది. ఇంతకీ ఆ తల్లికి వచ్చిన కష్టమేమిటి..?

  • Share this:
    తల్లులకు పిల్లలే ప్రపంచం. వారిని చూసుకునే మురిసిపోతారు. అయితే ఓ తల్లి పిల్లల అనారోగ్యం చూసి తట్టుకోలేకపోయింది. పిల్లలను ఉరేసి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డిలో శుక్రవారం చోటుచేసకుంది. వివరాలు.. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంక్‌లో శివశంకర్ క్యాషియర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతని భార్య జోస్నా, ఇద్దరు కుమారులు రుద్రాక్షు(6), దేవాన్ష్(4) ఉన్నారు. శివశంకర్ 7 నెలల క్రితం ఆదిలాబాద్ నుంచి సంగారెడ్డి టౌన్‌కు బదిలీపై వచ్చాడు. శివశంకర్ పెద్ద అబ్బాయికి చిన్నప్పటి నుంచి కిడ్నీల సమస్య ఉంది. చిన్న అబ్బాయి దేవాన్షుకు మలవిసర్జన సరిగా లేకపోవడం సమస్యగా మారింది. దీంతో వారిద్దరిని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నారు.

    పిల్లలు వైద్యం కోసం ఖర్చులు పెరగడంతో.. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. మరోవైపు డాక్టర్లు కూడా పిల్లల జబ్బులు నయం కావని చెప్పడం శివశంకర్, జోస్నా దంపతులను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. ఈ క్రమంలోనే జోస్నా.. పిల్లలను చంపి, తాను కడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. శుక్రవారం ఉదయం శివశంకర్ బ్యాంక్‌కు వెళ్లిన తరువాత మధ్యాహ్నం సమయంలో జోస్నా ఇంట్లో తన ఇద్దరు కుమారులను చున్నీ తో ఉరి వేసి చంపిది. తరువాత జోస్నా తన యింటికి తాళం వేసి మహబూబ్‌సాగర్‌ చెరువు వద్దకు వెళ్లి భర్తకు వాట్సాప్‌లో ఫొటో పెట్టి చెరువులో దూకింది. అయితే ఆ సమయంలో కట్ట మీద ఉన్న వాళ్ళు ఆమెను గమనించి పైకి తీయడం జరిగింది.

    విషయం తెలుసుకున్న శివశంకర్ వెంటనే మహబూబ్‌సాగర్ చెరువు కట్ట వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి తాళం తీసి చూడగా.. బెడ్ పిల్లలు పడి ఉన్నారు. వెంటనే శివశంకర్ తన భార్య, ఇద్దరు పిల్లలను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే చి పిల్లలను పరీక్షించిన వైద్యులు.. వారు చనిపోయినట్లు తెలిపారు. జోస్నాను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక, శివశంకర్ పిర్యాదు మేరకు కేస్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
    Published by:Sumanth Kanukula
    First published: