NEWLY MARRIED WOMEN ESCAPES FROM HER IN LAW HOUSE WITH GOLD JEWELLERY IN UP BAH CITY SK
భర్తకు పాల గ్లాస్ ఇచ్చిన కొత్త పెళ్లికూతురు.. ప్రేమతో కాదు.. పెద్ద స్కెచ్చే వేసింది..
ప్రతీకాత్మక చిత్రం
సోమవారం రాత్రి భోజనం తర్వాత ఉపేంద్రతో పాటు అత్తా మామలకు పాలు ఇచ్చింది శాలిని. వారికి తెలియకుండా అందులో మత్తు మందు కలిపింది. ఆ పాలు తాగిన తర్వాత ఇంట్లో అందరూ మత్తులోకి జారుకున్నారు.
ఓ కిలాడీ పెళ్లి కూతురు స్టోరీ ఇది. పెళ్లైన మూడు వారాలకే అత్తంటిని సర్వం దోచేసింది. భర్తతో పాటు అత్తామామలకు మత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడింది. ఇంట్లో డబ్బులు, నగలు, దుస్తుల కాజేసి అక్కడి నుంచి ఉడాయించింది. యూపీలోని బాహ్ సిటీలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాహ్ నగరానికి చెందిన 22 ఏళ్ల ఉపేంద్రకు మే 7న శాలిని (20)తో వివాహం జరిగింది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మంచి అమ్మాయిగా పేరుంది. పెళ్లి జరిగిన మూడు వారాల పాటు బాగానే ఉంది. అత్తింటి వారితో బాగా కలిసిపోయింది. కాదు నటించింది. అవును.. మూడు వారాల తర్వాత ఆమెలోని దొంగ నిద్రలేచాడు. అందరికీ మత్తు మందు ఇచ్చి అంతా దోచుకెళ్లింది.
సోమవారం రాత్రి భోజనం తర్వాత ఉపేంద్రతో పాటు అత్తా మామలకు పాలు ఇచ్చింది శాలిని. వారికి తెలియకుండా అందులో మత్తు మందు కలిపింది. ఆ పాలు తాగిన తర్వాత ఇంట్లో అందరూ మత్తులోకి జారుకున్నారు. అనంతరం తన ప్లాన్‌ను అమలు చేసింది శాలిని. ఇంట్లో ఉన్న డబ్బు, విలువైన నగలు, బట్టలు తీసుకొని అక్కడి నుంచి పారిపోయింది. ఉదయం నిదల్రేచి చూసే సరికి కోడలు కనిపించలేదు. ఎంత సేపు వెతికినా దొరకలేదు. అనుమానం వచ్చి బీరువా చూడడంతో అసలు విషయం తెలిసింది. ఇంట్లో విలువైన వస్తువులు మాయమయ్యాయి. తమ ఇంట్లో అడుగుపెట్టింది కోడలు కాదు.. దొంగ అని అర్ధమయింది. అనంతరం జరిగిన ఘటనపై పోలీసులను ఆశ్రయించారు. ఆమె భర్త ఉపేంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.