GOA COVID DEATHS TOLL RISES TO 74 AT GOA HOSPITAL AS 13 MORE COVID PATIENTS DIE DUE TO LACK OF OXYGEN SK
Covid Deaths: ఆక్సిజన్ అందక ఒకే ఆస్పత్రిలో 74 మంది మృతి.. గోవాలో మరణ మృదంగం
ప్రతీకాత్మక చిత్రం
మన దేశంలో గోవాలోనే అత్యధిక కరోనా పాజిటివిటీ రేటు ఉంది. దాదాపు 48.17 శాతం వరకు పాజిటివిటీ రేటు నమోదవుతోంది. అంటే అక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అవుతోంది.
గోవాలో కోవిడ్ రోగుల మరణ మృదంగం కొనసాగుతోంది. ఆక్సిజన్ అందక కరోనా బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. సకాలంలో ప్రాణ వాయువు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. గత మూడు రోజుల్లో గోవాలోని ఒకే ఆస్పత్రిలో 74 మంది మృతి చెందారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గోవా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (GMCH)లో కొన్ని రోజులుగా తీవ్ర ఆక్సిజన్ కొరత నెలకొంది. సకాలంలో ఆక్సిజన్ అందక ఐసీయూలో ప్రతి రోజూ పదుల సంఖ్యలో రోగులు మరణిస్తున్నారు. మంగళవారం నుంచి వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. మంగళవారం 26, బుధవారం 20, గురువారం 15, శుక్రవారం ఉదయం వరకు మరో 13 మంది మరణించారు. ఇలా మంగళవారం నుంచి ఇప్పటి వరకు ఒకే ఆస్పత్రిలో 76 మంది రోగులు మృతి చెందారు.
Goemkars are devastated & heartbroken as inspite of a truce between @DrPramodPSawant & @visrane brokered by Centre, 13 have reportedly died last night due to ‘logistical issues’ @GoaGmc during the critical ‘dark hours’ (1-6AM)!We need action not just another committee of enquiry
గోవా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కోవిడ్ రోగుల మరణాలకు బాధ్యత వహిస్తూ సీఎం పదవికి ప్రమోద్ సావంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గోవాలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా ఏప్రిల్ 30- మే 11 మధ్య 378 మంది మరణించినట్టు ప్రభుత్వం బాంబే హైకోర్టుకు గురువారం వెల్లడించింది. ఇప్పటికీ మరణాలు కొనసాగుతున్నాయి. ఐతే ఆక్సిజన్ లేకపోవడం వల్లే మరణాలు పెరుగుతున్నాయని గోవాకు ప్రతి రోజు 22 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని గోవా ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. మరోవైపు కరోనా రోగులతో గోవా మెడికల్ కాలేజీ పూర్తిగా నిండిపోయింది. కొత్త రోగులు వస్తే వారికి చోటు లేదు. నేలపైనే ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.
మన దేశంలో గోవాలోనే అత్యధిక కరోనా పాజిటివిటీ రేటు ఉంది. దాదాపు 48.17 శాతం వరకు పాజిటివిటీ రేటు నమోదవుతోంది. అంటే అక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. గోవా తర్వాతి స్థానాల్లో పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, హర్యాణా, కర్నాటక ఉన్నాయి. కాగా, గోవాలో గురువారం 2491 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా నుంచి 2266 మంది కోలుకున్నారు. మరో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా లెక్కలతో గోవాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,30,130కి చేరింది. ఇప్పటి వరకు 95,240 మంది కోలుకోగా.. కోవిడ్ బారినపడి 1,937 మంది మరణించారు. ప్రస్తుతం గోవాలో 32,953 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.