Horoscope Weekly Telugu: ప్రతి వారం న్యూస్18 తెలుగు వారఫలాలను అందిస్తోంది. ప్రతి ఒక్కరికీ ఒక రాశి ఉంటుంది. ప్రతి రాశికీ మంచీ, చెడూ ఫలితాలు ఉంటాయి. ఏ రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ఆర్థిక అంశాల్లో ఎలాంటి శుభాలు జరుగుతాయి? పంచాంగం ఎలాంటి అంశాలను సూచిస్తోంది? ఏయే శుభవార్తలను జ్యోతిషశాస్త్రం అందిస్తోంది? ఈ వారం రాశిఫలాలతో ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఏవైనా అవరోధాలు, కష్టాలు ఉంటే ముందుగానే వాటిని అంచనా వేసి... సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలు కలుగుతుంది. ఈ వారం మార్చి 28, 2021 నుంచి ఏప్రిల్ 3 వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (Aries)
మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్‌వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాదనలు, వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బు నష్టపోతారు జాగ్రత్త.
వృషభ రాశి (Taurus)
ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది.
మిథున రాశి (Gemini)
గ్రహ సంచారం సరిగ్గా లేని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. డబ్బు నష్టపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. ఆదాయం నిలకడగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. నంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సైన్స్, ఐ.టి విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధి సాధిస్తారు.
కర్కాటక రాశి (Cancer)
విందు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. శుభవార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజినీర్లకు, ఐ.టి నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది.
సింహ రాశి (Leo)
గ్రహ సంచారం ఏమంత అనుకూలంగా లేదు. ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంది. విద్యార్థులకు పరవాలేదు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వ్యాపార, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
కన్య రాశి (Virgo)
గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువ్ల ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. కొందరు స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూల సమయం.
తుల రాశి (Libra)
గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల వ్యక్తిగత సమస్యలు పెరిగి ఇబ్బందులు పడతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. పెండింగ్‌లో ఉన్న పనుల్లో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీలు ఉండవద్దు. దెబ్బతింటారు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూల సమయం. ఇంటా బయటా ఒత్తిడి ఉండవచ్చు.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ వారం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడతారు. ఖర్చులు పెరిగి అప్పులు చేయాల్సి వస్తుంది. స్నేహితులు, బంధువులు సహాయం అందజేస్తారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వీసా సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం చూసుకోవాలి.
ధనస్సు రాశి (Sagittarius)
అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు... ఉపాధ్యాయుల లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది.
మకర రాశి (Capricorn)
గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా మారుతోంది. శుభవార్త వింటారు. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ఏలిన నాటి శని కారణంగా కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇల్లు మారే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉండవు.
కుంభ రాశి (Aquarius)
ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఏలిన నాటి శని వల్ల తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. శ్రమ అధికం, ఫలితం స్వల్పం అన్నట్టుగా ఉంటుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
ఇది కూడా చదవండి:Health Benefits of Lemon Water: వేడి నీరు, నిమ్మరసంతో అద్భుతమైన 9 ప్రయోజనాలు
మీన రాశి (Pisces)
ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు గానీ, స్థలం గానీ కొనే అవకాశం ఉంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారుల అభివృద్ధికి అవకాశం ఉంది. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు.