• Home
  • »
  • News
  • »
  • astrology
  • »
  • HOROSCOPE TODAY RASI PHALALU ASTROLOGY ON 8TH APRIL 2021 THESE ZODIAC SIGNS GET PROFITS IN THEIR BUSINESS SK

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారి వృత్తి, వ్యాపారాల్లో లాభాల జోరు

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: ఫిబ్రవరి 8 (గురువారం) రాశి ఫలాలు. నేడు 12 రాశుల వారికి ఎలా ఉంది? ఎవరికి బాగుంది? ఏ రాశుల వారికి బాగా లేదు? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ వివరాలన్నింటినీ ఇక్కడ చూడండి.

  • Share this:
    ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఎప్పుడు కష్టం వస్తుందో.. ఎప్పుడు సుఖం ఎదురవుతుందో అంచనా వేయడం కష్టమే. కానీ భవిష్యత్‌లో ఏం జరుగుతుందన్నది రాశి ఫలాల ద్వారా కొంత వరకు తెలుసుకోవచ్చు. ఎప్పుడు సమయం అనకూలంగా ఉంది? ఏ రోజు మనకు బాగాలేదు? ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది? అనే వివరాలను గ్రహాల పరిస్థితి ద్వారా అంచనా వేయచ్చు. మరి నేడు ఏప్రిల్ 8న 12 రాశుల వారికి ఎలా ఉందో ఇక్కడ చూడండి.


    మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

    సొంత నిర్ణయాలు, స్వయం కృషి సత్ఫలితాలనిస్తాయి. అనుకూలమైన కాలం నడుస్తోంది. ఇప్పుడు తలపెట్టిన పనుల్లో అధిక లాభం ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం పరవాలేదు.


    వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

    ఇష్ట కార్యాన్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి కాలం అనుకూలంగా ఉంది. బంధుమిత్రుకు బాగా సహాయం చేస్తారు. ఆదాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన పని మీకు అనుకూంగా నెరవేరుతుంది. గృహ లాభం, వాహన యోగం ఉన్నాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది.



    మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

    బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ, కుటుంబపరంగా సమస్యలు ఎదురవుతుంటాయి. ఓపికతో వ్యవహరించి వీటిని పరిష్కరించుకుంటారు. పాజిటివ్‌గా ఉండండి. అభివృద్ధి పైనే దృష్టి పెట్టండి . అంతా మీరు అశించిన విధంగానే జరుగుతుంది. తలచిన పనులు చాలా వరకు నెరవేరుతాయి.



    కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

    మంచి కాలం నడుస్తోంది. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. సంకల్ప బలం బాగానే ఉంది. బంధుమిత్రులతో అపార్థాలకు అవకాశం లేకుండా వ్యహహరించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది. గృహ, వాహన యోగానికి అవకాశముంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.




    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

    ఇంటా బయటా సమస్యలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి . మీ కోరిక నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. సొంత నిర్ణయంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా సలహాలు తీసుకుంటే మంచిది. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తి చేస్తారు.


    కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

    ఉద్యోగం ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలుంటాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. కొన్ని వ్యక్తిగత కారణాల కార్యాల్లో మిత్రుల సహాయం తీసుకోండి. మంచి శుభవార్త వింటారు.


    తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

    ప్రస్తుతం అన్నివిధాలా మంచి కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. సంతానం గురించి శుభవార్త వింటారు. ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి.


    వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

    ఇంటా బయటా సమస్యలున్నా ముందుకు దూసుకు వెళతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనుల్ని ఇప్పుడు పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఎదుగుదలకు వీలైన సమయం ఇది. ఇప్పుడు తలపెట్టిన పనులు విజయాన్నిస్తాయి.



    ధనుస్సు (మూల, పూర్వాషాడ, ఉత్తరాషాఢ 1)

    పట్టుదలగా పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగానే ఉన్నాయి. ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. సంతాన పరంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. బంధువులు కొందరు అపనిందలు వేస్తారు. ఆరోగ్యానికి ఢోకా లేదు.



    మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

    ఆటంకాలు ఎదురైన చాలావరకు పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు నిరుత్సాహం కలిగించవచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. తోటివారి సహకారంతో కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త.




    కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

    అనుకున్న పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుకు సహాయపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం చేతికి వస్తుంది. అధిక ధన లాభం ఉంది. బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్ర దర్శనం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి.



    మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

    శుభవార్త వింటారు. విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. బంధుమిత్రు ద్వారా మంచి మేలు జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వస్తువు కొనుగోలు చేస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published: