
Vastu Tips: ఇండియాలో వాస్తు శాస్త్రానికి ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఎందుకైనా మంచిది వాస్తును ఫాలో అవుదాం అని చాలా మంది అనుకుంటున్నారు. ఇళ్లు కట్టేటప్పుడు ఎలాగూ వాస్తు ఫాలో అవుతారు. కానీ ఇంట్లో దిగిన తర్వాత... ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలన్నది మనకు తెలియదు. దీనికి వాస్తు నిపుణుల దగ్గర ఆన్సర్ ఉంది. ముఖ్యంగా డ్రాయింగ్ రూమ్ (దీన్నే మనం హాల్ అని కూడా అంటాం)లో టీవీ, టెలిఫోన్, అల్మరాను ఎక్కడబడితే అక్కడ పెట్టకూడదు అంటున్నారు.