
- News18 Telugu
- Last Updated: April 20, 2021, 15:37 IST
మహేష్ హైదరాబాద్ లో ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. లోన్ పై గత ఏడాది ఒక కారు కోనుగోలు చేశాడు. అయితే పెట్రోల్ ధరలు రోజు రోజుకి చుక్కులను తాకుతుండటంతో ప్రస్తుతం అందరూ ఎలక్ట్రికల్ కార్లు వైపు చూస్తున్నారు. దీంతో మహేష్ మనసు కూడా ఎలక్ట్రిక్ కారుపై పడింది. ఐతే కోనుగోలు చేసిన కారును అమ్మి మళ్లీ ఎలక్ట్రికల్ కారు కొనలేక అలాగని పెరిగిన పెట్రోల్ ధరలతో ఉన్న కారును వాడలేక సతమతమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితి ఒక్క మహేష్ దే కాదు మనలో చాలా మందికి ఇదే పరిస్థితి ఉండే ఉంటుంది. సరిగ్గా ఈ సమస్యను గుర్తించే హైదరాబాద్ కు చెందిన ఒక సార్ట్ అప్ కంపెనీ మన దగ్గర ఉన్న కారునే ఎలక్ట్రికల్ కారుగా మార్చేందుకు ముందుకొస్తోంది. ప్రస్తుతం మీ దగ్గర ఏ కారు ఉన్నా దాన్నే ఎలక్ట్రికల్ కారుగా మార్చేస్తుంది ఈ సంస్థ. భారత్ మోబీ పేరుతో ఉన్న ఈ స్టార్ట్ ఫ్ కంపెనీ ఇప్పుడు హైదరాబాద్ లో ఈ సేవాలు అందిస్తోంది.
మన వద్ద ఎలాంటి కారు ఉన్న అది ఎంత పాత కారైనా సరే.. మోబి భారత్ సంస్థ దాన్ని ఎలక్ట్రీకల్ మార్చేస్తుంది. ఈ సంస్థ వారు రూపోందించిన బ్యాటిరీ కిట్ ను కారులో అమర్చడం వల్ల అప్పటి వరకు డీజీల్ లేదా ప్రెట్రోల్ కారులా ఉన్న వాహనం ఎలక్ట్రికల్ వెహికల్ గా మారిపోతుంది. ఇలా ఎలక్ట్రికల్ వాహనంగా మారిన కారు గంటకు 80 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదని అంటున్నారు సంస్థ ప్రతినిధులు.
పెట్రోల్ కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మార్చేస్తున్న సంస్థ
దేశవ్యాప్తంగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరో వైపు ఢిల్లీ లాంటి నగరాల్లో వాయుకాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది. వీటి నేపధ్యంలో అందరూ వేరే మార్గాల వైపు చూస్తున్నారు. సరిగ్గా ఈ ఆలోచనతోనే తాము ఈ సంస్థను స్థాపించినట్లు మోబీ భారత్ నిర్వహకులు చెప్తున్నారు. “అయితే కొత్త ఎలక్ట్రిక్ కారు కోనుగోలు చేయడం సరే ఉన్న కారును ఎలా అనే దగ్గరే మేము వర్క్ చేశాం. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రం గా సేవాలు అందిస్తోన్నాం. భవిష్యత్ లో మరింత విసృతం చేయడానికి ప్రయత్నాలు చేస్తోన్నాం” అని న్యూస్ 18 కి తెలపారు సంస్థ ప్రతినిధులు.
పెట్రోల్ కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మార్చేస్తున్న సంస్థ
ఇదిలా ఉంటే ఒక నార్మల్ కారును ఎలక్ట్రిక వాహానంగా మార్చడానికి దాదాపు 3 నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు సంస్థ యజమానులు. ఇప్పటి వరకు దాదాపు 96 కార్ల కు పై ఎలక్ట్రికల్ వాహానాలుగా మార్చమని చెబుతున్నారు. రోజుకి వందల సంఖ్యలో కాల్స్ వస్తున్నట్లు చెప్తున్నారు. ఒక వైపు పెట్రోల్ ధరలు పెరగడం వలన ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలవైపు అందరు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు.