
- News18 Telugu
- Last Updated: April 21, 2021, 14:26 IST
ఏ క్రీడాకారుడైన తమ దేశానికి పేరు తెచ్చిపెట్టాలని భావిస్తుంటాడు. తాను పుట్టిన దేశం కోసం ఆట ఆడాలని కోరుకుంటాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్న పలువరు క్రికెటర్లు (Cricket) ఒక దేశంలో పుట్టి మరొక దేశానికి ఆడుతున్నారు. వారేమీ అనామక క్రికెటర్లు కాదు. వాళ్లు ఆయా జట్లలో కీలక సభ్యులుగా ఉన్నారు. అలాంటి క్రికెటర్లను మనం చూద్దాం.
\1\6#జేసన్ రాయ్
ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మాన్ జేసన్ రాయ్ ఆ జట్టులో కీలక సభ్యుడు. ఇటీవల భారత పర్యటనలో దూకుడుగా ఆడాడు. తాజాగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఈ జేసన్ రాయ్ పుట్టింది ఇంగ్లాండ్‌లో కాదు. అతడు స్వతహాగా సౌతాఫ్రికా దేశస్థుడు. డర్బన్‌లో పుట్టిన రాయ్.. 10 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్‌కు వలసవచ్చి కౌంటీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. సర్రే తరపున టీ20 ఫార్మాట్ ఆడాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
#కొలిన్ మున్రో
దూకుడైన ఆటకు మరోపేరైన కొలిన్ మున్రో న్యూజీలాండ్ తరపున ఆడుతున్నాడు. 2012లో కివీస్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మున్రో.. పుట్టింది సౌతాఫ్రికాలోనే. 2012 నుంచి కివీస్ తరపున టీ20, వన్డే జట్టులో ఓపెనర్‌గా ఆడుతున్నాడు. 2019 వరల్డ్ కప్‌జట్టులో కూడా ఉన్నాడు.
#ఇయాన్ మోర్గాన్
ఇంగ్లాండ్ జట్టుకు వన్డే వరల్డ్ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ పుట్టింది ఆ దేశంలో కాదు. ఐర్లాండ్ దేశంలో పుట్టిన మోర్గాన్ అక్కడే క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. ఆ దేశం తరపున కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఇంగ్లాండ్ వచ్చిన మోర్గాన్.. ఏకంగా కెప్టెన్ అయ్యాడు.
#ఉస్మాన్ ఖవాజా
పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో పుట్టిన ఉస్మాన్ ఖవాజా వృత్తి రిత్యా పైలెట్. అయితే క్రికెట్‌పై మక్కువతో ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. ఆట ఏకంగా అతడి ప్రొఫెషనల్ కెరీర్‌గా మారిపోయింది. ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికైన ఖవాజా పలు టెస్టులు ఆడాడు. ఆస్ట్రేలియా తరపున ఆడిన తొలి ముస్లిం క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.
#ఇష్ సోథీ
ఇండియాలోని పంజాబ్ రాష్ట్రం లుథియానాలో పుట్టిన ఇందర్‌బిర్ సింగ్ ఆ తర్వాత ఇష్ సోథీగా మారి కివీజ్ జట్టు తరపున క్రికెట్ ఆడాడు. సోథీ 4 ఏళ్ల వయసున్నప్పుడు అతడి తల్లిదండ్రులు న్యూజీలాండ్‌కు వలసవెళ్లారు. కివీస్ పిచ్‌లు స్పిన్‌కు అంతగా అనుకూలంగా లేకపోయాని.. కష్టపడి జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు.
#బెన్‌స్టోక్స్
ఇంగ్లాండ్ స్టార్ అల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పుట్టింది న్యూజీలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్‌లో. స్టోక్స్ తండ్రి గెరార్డ్ స్ట్రోక్స్ న్యూజీలాండ్ రగ్బీ జట్టు తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. బెన్‌స్టోక్స్ పూర్తి పేరు బెంజమిన్ స్ట్రోక్స్. అయితే 18 ఏళ్ల వయసులో కౌంటీ క్రికెట్ ఆడిన బెన్ స్టోక్స్.. 2009లో సర్రే తరపున వన్డే క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు.
#ఇమ్రాన్ తాహిర్
పాకిస్తాన్‌లో పుట్టిన తాహీర్ తన జీవితంలో 20 కంటే ఎక్కువ జట్లకు ఆడాడు. ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ కూడా ఆడాడు. చివరకు సౌతాఫ్రికా జట్టులో తన 31వ ఏట స్థానం సంపాదించాడు. లాహోర్‌లో పుట్టిన తాహీర్ తన భార్య కోసం దక్షిణాఫ్రికా వెళ్లి స్థిరపడాల్సి వచ్చింది.
#కొలిన్ డి గ్రాండ్‌హోమ్
సౌతాఫ్రికా జట్టులోని స్టార్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ పుట్టింది జింబాబ్వేలోని హారారేలో. 2012లో జింజాబ్వే తరపునే టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన గ్రాండ్‌హోమ్.. నెల తిరిగే సరికి సౌతాఫ్రికా జట్టులో స్థానం సంపాదించడం విశేషం.
#ఇమద్ వాసిమ్
పాకిస్తాన్ జట్టులోని ఇమద్ వాసిమ్ పుట్టింది వేల్స్ దేశంలో. కానీ బాలుడిగా ఉన్నప్పటి నుంచే పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడుతూ అంచలంచెలుగా ఎదిగాడు. 2006లో పాకిస్తాన్ అండర్ 19 జట్టులో స్థానం సంపాదించాడు. ఆ తర్వాత జాతీయ జట్టులోకి వచ్చాడు.
#జోఫ్రా ఆర్చర్
ఇంగ్లాండ్ జట్టులో కీలక పేసర్ అయిన జోఫ్రా ఆర్చర్ పుట్టింది బార్బడోస్ ద్వీపంలో. బ్రిటిష్ తండ్రికి, బార్బొడోస్ తల్లికి జన్మించిన ఆర్చర్ వెస్టిండీస్ అండర్ 19 జట్టులో కీలక సభ్యుడిగా ఉండేవాడు. అయితే ఆ తర్వాత తండ్రి కోరిక మేరకు ఇంగ్లాండ్‌కు వెళ్లి జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు.
ఈ పది మంది క్రికెటర్లు ఆయా దేశాల తరపున 2019 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఆడటం విశేషం.