
- News18 Telugu
- Last Updated: April 18, 2021, 23:22 IST
చెపాక్ వేదికగా కేకేఆర్,ఆర్సీబి మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కొల్‌కతా జట్టు 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 205 పరుగుల భారీ టార్గెట్ ఛేదించలేక చతికలపడింది. టార్గెట్ ఛేదనకు బ్యాటింగ్ దిగిన కేకేఆర్‌కు అదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జేమీసన్ వేసిన రెండో ఓవర్లో శుభమన్ గిల్(21) ఔటయ్యాడు. ఆ ఓవర్లో మొదటి బంతిని ఫోర్, మూడు, నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచిన శుభమన్ గిల్ ఐదో బంతికి క్రిస్టియన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ వేసిన ఆరో ఓవర్లో చివరి బంతికి రాహుల్ త్రిపాఠి(25) భారీ షాట్ ఆడబోయి సిరాజ్‌కు చిక్కాడు. దీంతో పవర్ ఫ్లే ముగిసే సమయానికి కోల్‌కతా 57/2 పరుగులు చేసింది.
7 ఓవర్లో కోల్‌కతా మరో వికెట్ నష్టపోయింది. చాహల్ వేసిన ఈ ఓవర్లో రెండో,నాలుగో బంతిని ఫోర్ బాదిన నితీశ్ రాణా(18) ఐదో బంతికి దేవదత్ పడిక్కల్‌కు చిక్కాడు. 9 ఓవర్లో కోల్‌కత్తాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చాహల్ వేసిన ఈ ఓవర్‌లో మూడో బంతికి దినేశ్ కార్తీక్(2) ఔటయ్యాడు. అతడు ఎల్బీగా వెనుదిరగడంతో కోల్‌కతా నాలుగో వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత వరుసగా కేకేఆర్ వికెట్లు కోల్పోవడం.. రసుల్ బ్యాట్ ఝళీపించిన లాభం లేకపోయింది.