
- News18 Telugu
- Last Updated: April 17, 2021, 18:08 IST
ఈ రోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ ఎడిషన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇరు జట్లు రెండు మ్యాచ్‌లను ఎదుర్కొన్నాయి. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై జట్టు ఒక మ్యాచ్‌లో గెలిచి, మరొక మ్యాచ్‌లో ఓడిపోయింది. అదేవిధంగా డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కాబట్టి నేటి మ్యాచ్ హైదరాబాద్ జట్టుకు చాలా ముఖ్యం.
ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికను గమనించినప్పుడు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 4 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టు రెండో స్థానంలో. ముంబై ఇండియన్స్ రెండు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. సన్ రైజర్స్ ప్రస్తుతం సున్నా పాయింట్లతో 8 వ స్థానంలో ఉంది.
ఈ మ్యాచ్ గెలిస్తే డిపెండింగ్ ఛాంపియన్ ముంబై జట్టు పట్టిక మెుదటి స్థానంలో నిలుస్తోంది. ఇక సన్ రైజర్స్‌కు ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనది. ఇక ఛాలెజింగ్ పోరులో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.
మ్యాచ్ ప్రారంభ సమయం: 7:30 PM IST
గ్రౌండ్: చెన్నై, చిదంబరం స్టేడియం
ప్రసారం: స్టార్ స్పోర్ట్స్
ముంబై ఇండియన్స్ జట్టు ( అంచనా): రోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, మార్కో జాన్సెన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా
సన్ రైజర్స్ హైదరాబాద్ ( అంచనా): వార్నర్, జానీ బెయిర్‌స్టో / కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, జాసన్ హోల్డర్, భువనేశ్వర్ కుమార్, షాబాజ్ నదీమ్, టి నటరాజన్