2016లో జరిగినట్లే ఇప్పుడు జరుగుతుంది.. సన్‌రైజర్స్ టైటిల్ గెలుస్తోంది!

2016 ఐపీఎల్‌‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సీజన్‌లో టీం అల్‌రౌండర్ ప్రతిభతొ ఆకట్టుకుంది. డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలో సన్‌రైజర్స్‌

2016లో జరిగినట్లే ఇప్పుడు జరుగుతుంది.. సన్‌రైజర్స్ టైటిల్ గెలుస్తోంది!

    ఐపీఎల్‌ 2021 సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు శకునం కుదరడం లేదు. ఆడిన మ్యా్చ్‌లో చివరి అంచుల వరకు వెళ్ళి గెలుపు ముగింట్లో బోల్తా పడుతుంది. ఇక మూడో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌తో తలపడబోతోంది. ఫాన్స్ అందరూ సన్‌రైజర్స్‌ ఎప్పుడు బోణీ కొడుతుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఓసారి లెక్కలను పరిశీలిస్తే సన్‌రైజర్స్‌కే అడ్వాంటెజ్ కనిపిస్తోంది. ఐపీఎల్ టైటిల్ నెగ్గె పెవరెట్ జట్లలలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మీద భారీ అంచనాలు అయితే ఎప్పుడూ లేవు. ఐపీఎల్ 2021లో కూడా అంతే. కానీ ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ గణాంకాలు మాత్రం ఓ తమాషాను చూపిస్తున్నాయి. దానికి ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ ఐపీఎల్ టైటిల్ నెగ్గే సూచనలు ఇవే అంటున్నాయి.

    2016 ఐపీఎల్‌‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సీజన్‌లో టీం అల్‌రౌండర్ ప్రతిభతొ ఆకట్టుకుంది. డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలో సన్‌రైజర్స్‌ జట్టు అద్భుతమైన ప్లాన్స్‌తో ప్రత్యర్ధులను బోల్తా కొట్టించాయి. అయితే ఆ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ ప్రయాణం అనుకున్నంత సులువుగా సాగలేదు. ఇక ఆ సీజన్‌లోనూ మొదట రెండు మ్యాచుల్నీ సన్ రైజర్స్‌ ఓడిపోయింది. మూడో మ్యాచ్‌ నుంచి తన సత్తా చాటింది. అక్కడ గెమ్ ప్లాన్ టైటిల్ గెలిచేంత వరకు సాగింది.

    ఇక 2016 ఐపీఎల్‌ సీజన్‌లోనూ సన్‌రైజర్స్‌ ముందుగా ఓడిపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌పైనే. ఇక 2021 సీజన్‌లోనూ అదే జరిగింది. అప్పుడు కూడా ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ స్కోరు 140 దాటింది. 2016 వ సీజన్‌లో సన్‌‌రైజర్స్ హైదరాబాద్ మూడో మ్యాచ్‌ అడింది ముంబయితోనే ఆడి గెలిచింది. 2021లో కూడా మూడో మ్యాచ్‌ ముంబయితోనే అడుతుంది. అన్ని కూడా 2016లో జరుగుతున్నట్లు ఉన్నాయి కాబట్టి 2021లో కూడా సన్‌రైజర్స్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.

    Published by:Rekulapally Saichand
    First published:April 17, 2021, 22:13 IST