DC vs PBKS: దంచికొట్టిన మయాంక్,రాహుల్.. పంజాబ్ భారీ స్కోర్

ఆదివారం ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతుంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌‌ ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ దిగిన పంజాబ్ భారీ స్కోర్ సాధించింది

DC vs PBKS: దంచికొట్టిన మయాంక్,రాహుల్.. పంజాబ్ భారీ స్కోర్

    ముంబైలోని వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్,ఢిల్లీ క్యాపిటల్స్  జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతుంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌‌ ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ దిగిన పంజాబ్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణత 20 ఓవర్లో 195 పరుగులు  చేసింది. పంజాబ్‌ కింగ్స్‌కు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (61), మయాంక్‌ అగర్వాల్‌(69) సూపర్ హిట్టింగ్ బ్యాటింగ్‌తో పంజాబ్‌కు భారీ స్కోర్ సాధించిపెట్టారు. మెుదటి నుంచి పంజాబ్ బ్యాట్స్‌మెన్స్ దూకుడుగానే ఆడారు.

    పవర్ ఫ్లే 6 ఓవర్లకు పంజాబ్‌ 59/0 పరుగులు సాధించింది. మయాంక్‌ అగర్వాల్‌(33 బంతుల్లో 68; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీతో కందం తొక్కాడు. బౌండరీయే లక్ష్యంగా చేలరేగాడు. రబాడ వేసిన 11వ ఓవర్‌లో మూడు వరుస సిక్సర్లు బాదాడు. అతని దాటికి పంజాబ్ 12 ఓవర్లలో 120/0 స్కోర్‌ సాధించింది. చివరకు మెరివాల వేసిన 13 ఓవర్లో మయాంక్‌ అగర్వాల్‌(69) ధావన్‌కు చిక్కాడు. దీంతో పంజాబ్ తన మెుదటి వికెట్‌ను కోల్పోయింది. మరోవైపు రాహుల్‌(50) కూడా దాటిగా ఆడుతూ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దాటిగా క్రమంలో రబాడ వేసిన 16వ ఓవర్‌లో రెండో బంతికి కెప్టెన్‌ రాహుల్‌(61) స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత క్రిస్ వోక్స్‌ ఓవర్‌లో రెండో బంతికి క్రిస్‌ గేల్‌(11) రిపాల్ పటేల్‌కు చిక్కాడు. దీంతో పంజాబ్ జోరు కాస్త తగ్గింది. చివరకు 195 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

    Published by:Rekulapally Saichand
    First published:April 18, 2021, 21:14 IST