
- News18 Telugu
- Last Updated: April 16, 2021, 19:07 IST
ఐపీఎల్ 14 వ సీజన్ లో ఎనిమిదో మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్.. యంగ్ టాలెంటెడ్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ధోనీ.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో ఆడిన టీమ్ తోనే ఈ మ్యాచ్ లో కూడా బరిలోకి దిగుతోంది ధోనీసేన. ఈ సీజన్ లో టాస్ గెలిచిన ప్రతి జట్టు ఛేజింగ్ కే మొగ్గు చూపుతున్నారు. అయితే, గత కొద్ది మ్యాచ్ ల నుంచి బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్ లే మ్యాచ్ లు నెగ్గుతున్నాయ్.ధోనీ సేనకు ఈ సీజన్‌లో ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడిపోయింది. ధోనీ డకౌట్, సామ్ కుర్రమ్ బ్యాటింగ్ మెరుపులు ఆ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచాయి. 188 పరుగుల భారీ స్కోర్‌ను సాధించినప్పటికీ.. ఓటమి నుంచి బయటపడలేకపోయింది. మరోవైపు ఆడిన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రెచ్చిపోయారు. 221 భారీ పరుగులను ప్రత్యర్థికి నిర్దేశించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, దీపక్ హుడా రెచ్చిపోయి ఆడారు. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 220 ప్లస్ స్కోర్ చేయడం ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. బ్యాటింగ్ లైనప్ మొత్తం ఫుల్ ఫామ్‌లో ఉంది. అదే ఫామ్ చెన్నైపైనా చూపించగలిగితే.. మరోసారి భారీ స్కోర్ నమోదు కావడం ఖాయమే. చెన్నై జట్టులో ఇద్దరు కీలక ప్లేయర్లు ఆడట్లేదు. జట్టుకు దూరం అయ్యారు. లుంగి ఎంగిడి, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ ఆడట్లేదు.
CSKలో డుఫ్లెసిస్-రుతురాజ్ గైక్వాడ్‌లో ఇన్నింగ్‌ను ఆరంభించే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో వారిద్దరూ విఫలమయ్యారు. వీళ్లిద్దరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. జట్టు మిడిలార్డర్‌లో ఆల్ రౌండర్ సురేష్ రైనా, స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు, కెప్టెన్ ధోనీ జట్టుకు ప్లస్ కానున్నారు. బౌలింగ్ లో దీపక్ చాహర్, సామ్ కర్రన్, డ్వేన్ బ్రావో కీలకం కానున్నారు.ఇక, హెడ్ టు హెడ్ రికార్డుల్లో చెన్నైదే పై చేయి. ఇప్పటి వరకు ఇరు జట్లు మధ్య 23 మ్యాచ్ లు జరగగా..చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్ ల్లో నెగ్గగా.. పంజాబ్ కింగ్స్ 9 మ్యాచ్ ల్లో విజయ కేతనం ఎగురవేసింది.
తుది జట్లు :
\1\6Punjab Kings (Playing XI): KL Rahul(w/c), Mayank Agarwal, Chris Gayle, Deepak Hooda, Nicholas Pooran, Shahrukh Khan, Jhye Richardson, Murugan Ashwin, Riley Meredith, Mohammed Shami, Arshdeep Singh