
- News18 Telugu
- Last Updated: April 17, 2021, 19:22 IST
ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్,ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ సన్‌రైజర్స్‌కు చాలా ఇంపార్ట్‌టెంట్. ముంబై ఒక మార్పు చేయగా.. సన్‌రైజర్స్ నాలుగు మార్పులు చేసింది. ఖలీల్ ఆహ్మద్,విరాట్ సింగ్,ముజీబ్ ఉర్ రెహ్మాన్,అభిషేక్ శర్మ జట్టులోకి వచ్చారు. ముంబై ఆడమ్ మిల్నేను తుది జట్టులో చేర్చింది.
మ్యాచ్ ప్రారంభ సమయం: 7:30 PM IST
గ్రౌండ్: చెన్నై, చిదంబరం స్టేడియం
ప్రసారం: స్టార్ స్పోర్ట్స్
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అద్భుత విజయాన్ని సాధించిన ముంబయి ఇండియన్స్.. రెండో విజయంపై కన్నేసింది. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా బోణి కొట్టాలని చూస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ ఎలెవన్): డేవిడ్ వార్నర్ (సి), జానీ బెయిర్‌స్టో (wc), మనీష్ పాండే, విరాట్ సింగ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ (సి), క్వింటన్ డి కాక్ (wc), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, ఆడమ్ మిల్నే, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్