IPL 2021 MI vs SRH: సన్‌రైజర్స్ హాట్రిక్ ఓటమి .. ఇక వీళ్ళు మారరు!

ఐపీఎల్ 2021లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్,ముంబై ఇండియన్స్ మధ్య జరగుతున్న మ్యాచ్‌లో  ఎస్‌ఆహెచ్ హాట్రిక్ ఓటమిని చవిచూసింది. 

IPL 2021 MI vs SRH: సన్‌రైజర్స్ హాట్రిక్ ఓటమి .. ఇక వీళ్ళు మారరు!

    ఐపీఎల్ 2021లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్,ముంబై ఇండియన్స్ మధ్య జరగుతున్న మ్యాచ్‌లో  ఎస్‌ఆహెచ్ హాట్రిక్ ఓటమిని చవిచూసింది.   ముంబై నిర్ధేశించిన  టార్గెట్‌ను హైదరాబాద్ ఛెదించలేకపోయింది.  19.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటై  13 పరుగుల తేడాతొ ఓటిమిపాలైంది.  ఓపెనర్స్ డేవిడ్‌ వార్నర్‌, బెయిర్ స్టో మూడు ఓవర్ల వరకు స్లోగా ఆడిన తర్వాత విజృభించారు. బెయిర్ స్టో ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు. మూడు పోర్లు నాలుగు సిక్స్‌లు కొట్టి  కృనాల్‌ పాండ్య బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో(43) ఔటయ్యాడు. వెంటనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో వికెట్‌ కూడా కోల్పోయింది. మనీశ్‌ పాండే(2) రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో పొలార్డ్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వార్నర్‌ను హార్థిక్ పాండ్యా రనౌట్ చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపు విరాట్ సింగ్,విజయ్ శంకర్ ఆడిన ఆ తర్వాత సన్‌రైజర్స్ క్రమంగా వికెట్లు కోల్పోయి ఓటమిని చవిచూసింది,

    ముందు టాస్‌ గెలిచిన ముంబయి ఇండియన్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 150 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ ముందు 151 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ముంబై ఓపెనర్స్ రోహిత్‌ శర్మ, క్వింటన్‌ డికాక్‌ జట్టుకు మంచి అరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లే 6 ఓవర్లకు ముంబయి 53/0 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ (31), డికాక్‌ (16) శుభారంభం ఇచ్చారు. తర్వాత విజయశంకర్ రెండు తీసి ముంబై జోరును అపాడు. విజయ్‌ శంకర్‌ వేసిన 7 ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్‌ (32) విరాట్‌సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. విజయ్‌ శంకర్‌ 9 ఓవర్‌లో మరో వికెట్ సాధించాడు. రెండో బంతికి సిక్స్‌ కొట్టిన సూర్య ఆ తర్వాతి బంతికే రిటర్న్ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై కాస్త మందగించింది.

    విజయ్‌ శంకర్‌ 9 ఓవర్‌లో మరో వికెట్ సాధించాడు. రెండో బంతికి సిక్స్‌ కొట్టిన సూర్య ఆ తర్వాతి బంతికే రిటర్న్ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై కాస్త మందగించింది. చివరిలో పోలార్డ్ తన బ్యాట్‌ను ఝళీపించి ముంబై స్కోర్‌ను 150 పరుగులకు చేర్చాడు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ అరగ్రేటం చేసిన ముజీబుర్‌ రెహ్మాన్‌‌కు 2 వికెట్లు దక్కాయి

    Published by:Rekulapally Saichand
    First published:April 17, 2021, 23:15 IST