Ram Pothineni: సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌తో రామ్ పోతినేని నెక్ట్స్ ప్రాజెక్ట్.. ? త్వరలో సెట్స్ పైకి సినిమా..

Ram Pothineni: సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌తో రామ్ పోతినేని నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్ అయిందా.. ? త్వరలోనే పట్టాలెక్కనుందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.

Ram Pothineni: సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌తో రామ్ పోతినేని నెక్ట్స్ ప్రాజెక్ట్.. ? త్వరలో సెట్స్ పైకి సినిమా..

    Ram Pothineni: సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌తో రామ్ పోతినేని నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్ అయిందా.. ? త్వరలోనే పట్టాలెక్కనుందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస ఫ్లాపులతో సతమతవుతున్న వేళా.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో రామ్ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఊర మాస్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. ఆ ఒక్క సినిమాతో రామ్ కెరీర్ ఎక్కడికో వెళ్లింది. ఆ సినిమా అటు పూరి జగన్నాథ్‌కు ఇటు రామ్‌కు కొత్త ఊపిరిని ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఎన్నో అంచనాల నడుమ వచ్చిన రెడ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఆ సినిమాను స్రవంతి రవికిషోర్ స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించాడు.రెడ్ సినిమా తమిళ హిట్ చిత్రం ‘తడమ్’ కు తెలుగు రీమేక్‌గా వచ్చింది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది. ఇస్మార్ట్ శంకర్ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రెడ్ రావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

    అయితే వాటిని అందుకోలేకపోయింది రెడ్. ఈ సినిమాలో రామ్ తొలిసారి రెండు పాత్రల్లో కనిపించి అందరినీ అలరించారు. హీరోయిన్స్‌గా మాళవిక శర్మ, అమృత అయ్యర్ నటించారు.ఇక రెడ్ సినిమా తర్వాత  రామ్ లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టాడు.  ఈ సినిమా తర్వాత రామ్ పోతినేని .. టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

    రామ్ పోతినేని, అనిల్ రావిపూడి (Twitter/Photo)

    ఇప్పటికే అనిల్ రావిపూడి.. రామ్‌ను కలిసి ఓ లైన్ చెప్పగా .. దానికి రామ్ ఓకే చెప్పినట్టు సమాచారం. రెడీ తర్వాత ఆ తరహా కామెడీ సినిమాలు చేయని రామ్ పోతినేని.. ఇపుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ కామెడీ యాక్షన్ ఎంటర్టేనర్‌గా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. ప్రస్తుతం అనిల్ రావిపూడి.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో ‘ఎఫ్ 3’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక అనిల్ రావిపూడికి కరోనా సోకడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ సినిమాలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అతిథి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు అనిల్ రావిపూడి.. అఖిల్, ఎన్టీఆర్, అల్లు అర్జున్. బాలకృష్ణలకు కూడా కథలను వినిపించాడు. ఏది ఫైనల్ కాలేదు. ఇక అనిల్ రావిపూడి.. గతంలో రవితేజతో తెరకెక్కించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాను రామ్‌తో తెరకెక్కిద్దామనుకున్నాడు. కానీ ఎందుకో అపుడు అది వర్కౌట్ కాలేదు. మరి ఈ సారైనా రామ్ పోతినేని, అనిల్ రావిపూడి కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:April 19, 2021, 17:39 IST