
- News18 Telugu
- Last Updated: April 19, 2021, 18:22 IST
Ram Charan: శంకర్ సినిమాలో రామ్ చరణ్ అలాంటి ప్రయోగం చేయబోతున్నాడా.. ? అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. రామ్ చరణ్.. తన తర్వాతి ప్రాజెక్ట్‌ను దర్శకుడు శంకర్‌తో చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాను దిల్ రాజు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నాడు. ఇక శంకర్ కూడా తమిళంలో కాకుండా తెలుగులో ఓ హీరోతో సినిమా చేయడం ఇదే మొదటిసారి. గతంలో హిందీలో అనిల్ కపూర్‌తో ‘ఒకే ఒక్కడు’ సినిమాను ‘నాయక్’గా రీమేక్ చేసాడు. ఇపుడు అపరిచితుడు సినిమాను రణ్‌వీర్ సింగ్‌తో హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఇక శంకర్.. రామ్ చరణ్‌తో చేయబోయే సినిమాలో తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో చూపించబోతున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక శంకర్ కూడా తన సినిమాల్లో హీరోలను డిఫరెంట్ గెటప్‌లలో చూపించడం ముందు నుంచే ఉంది. భారతీయుడుతో కమల్ హాసన్‌ను ముసలి గెటప్‌లో చూపించి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత అపరిచితుడులో విక్రమ్.. రోబోలో రజినీకాంత్, 2.O సినిమాలో అక్షయ్ కుమార్‌ను డిఫరెంట్ గెటప్‌లో చూపించారు. ఇపుడు రామ్ చరణ్‌ను కూడా 60 ఏళ్ల వృద్దుడిగా చూపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే రామ్ చరణ్‌పై శంకర్ టెస్ట్ షూట్ కూడా ట్రయిల్ చేసి సంతృప్తి కూడా వ్యక్తం చేసాడట. ఈ జనరేషన్‌లో మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు.
శంకర్, రామ్ చరణ్ (Twitter/Photo)
ఒక్క మహేష్ బాబు మాత్రమే ముసలి గెటప్‌లో నాని సినిమాలో కనిపించారు. మిగతా ఎన్టీఆర్, ప్రభాస్ మాత్రం తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసినా.. ముసలి పాత్రల్లో నటించలేదు. ఇపుడు రామ్ చరణ్ మాత్రం అసురన్‌లో ధనుష్ తరహాలో పూర్తి స్థాయి ముసలిపాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ముందుగా ఈ ముసలి పాత్రను చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్‌తో చేయించాలనుకున్నాడు. కానీ ఫైనల్‌గా మాత్రం రామ్ చరణ్‌తో తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో చూపించాలని శంకర్ డిసైడ్ అయినట్టు సమాచారం. మరి తండ్రి కొడుకులుగా రామ్ చరణ్‌ను ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. ఈ సినిమాలో ఒక కథానాయికగా రష్మిక మందన్న నటిస్తుండగా.. మరో కథానాయికగా తండ్రికి జోడిగా కాజల్ అగర్వాల్‌ను అనుకుంటున్నారు. రష్మిక ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. మొత్తంగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తోన్న ఈ ప్రయోగం ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్.. నటించిన ’ఆచార్య’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు ఈ యేడాది విడుదల కానున్నాయి. ఆ తర్వాత సుకుమార్ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత శంకర్ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయని మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి వరకు శంకర్.. భారతీయుడు 2, రణ్‌వీర్ సింగ్‌తో ‘అపరిచితుడు’ సినిమాలు కంప్లీట్ చేసి ఫ్రీ అవుతాడు. మొత్తంగా శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై ప్యాన్ ఇండియా లెవల్లోక్రేజ్ ఏర్పడింది.