NTR 30 - Koratala Siva: అదిరిపోయే బ్యాక్ డ్రాప్‌లో ఎన్టీఆర్, కొరటాల శివ మూవీ..

NTR 30 - Koratala Siva: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమాను డిఫరెంట్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

NTR 30 - Koratala Siva: అదిరిపోయే బ్యాక్ డ్రాప్‌లో ఎన్టీఆర్, కొరటాల శివ మూవీ..

    NTR 30 - Koratala Siva: రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ  ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ఉగాది ముందు రోజు ప్రకటించాడు. జనతా గ్యారేజ్ సినిమాతో ఐదేళ్ళ కింద సంచలన విజయం సాధించిన వీరిద్దరు.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రిపేర్లు చేయడానికి వచ్చేస్తున్నారు. వాళ్లు కూడా ఇదే చెప్తున్నారు. అప్పుడు రిపేర్లు అన్నీ లోకల్‌లోనే జరిగాయి కానీ ఈ సారి మాత్రం నేషనల్ వైడ్ రిపేర్లు చేయబోతున్నామని స్పష్టం చేసాడు కొరటాల శివ. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా అని కన్ఫామ్ చేసాడు కొరటాల శివ. మరోసారి జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతుండటం హ్యాపీగా ఉందన్నాడు కొరటాల. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు.

    కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా ఉన్నాడు. ఎప్రిల్ 29, 2022న ఈ చిత్రం విడుదల కానుందని ప్రకటించారు దర్శక నిర్మాతలు. జులై తర్వాత షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్ షూటింగ్ చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం ఈయన చిరంజీవి ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను మే 13న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించినా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఎక్కువున్నాయి.

    జూనియర్ ఎన్టీఆర్ 30 (NTR 30)

    ఎన్టీఆర్‌తో రెండోసారి తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే మహేష్ బాబుతో ‘భరత్ అను నేను’ సినిమాను రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించాడు. ఈ సినిమాలో సీఎం కుమారుడు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తే.. ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాను మాత్రం ఒక సామాన్యుడు ఎలా రాజకీయాల్లో వచ్చి అంచలంచెలుగా ఎలా ఎదగడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. టోటల్‌గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మాజీ సీఎం ఎన్టీఆర్ జీవితాన్ని ఇన్‌స్పిరేషన్‌గాతీసుకొని.. వీళ్లిద్దరి జీవితాను మిక్స్ చేసి ఈ స్టోరీని కొరటాల రెడీ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా అనుకుంటున్నారు. ఆల్రెడీ మహేష్ బాబు భరత్ అను నేనులో కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే కదా.  మరో కథానాయికకు ఛాన్స్ ఉందని చెబుతున్నారు.  ఏదేమైనా కూడా జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబో ఎలా ఉండబోతుందో అని అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:April 19, 2021, 21:41 IST