UPSC Recruitment 2021: కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

UPSC CAPF Recruitment 2021 | కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 159 ఖాళీలను ప్రకటించింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

UPSC Recruitment 2021: కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్-CAPF (అసిస్టెంట్ కమాండెంట్స్) ఎగ్జామినేషన్, 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 159 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్-CRPF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్-ITBP, సశస్త్ర సీమా బల్-SSB సంస్థల్లో ఈ ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మే 5 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.upsc.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

    UPSC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

    మొత్తం ఖాళీలు- 159

    బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF)- 35

    సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)- 36

    సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)- 67

    ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్(ITBP)- 20

    సశస్త్ర సీమా బల్(SSB)- 1

    AP Metro Jobs: ఆంధ్రప్రదేశ్‌లో మెట్రోలో 350 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    IT Jobs 2021: ఫ్రెషర్స్‌కు జాబ్ అలర్ట్... ఐటీ కంపెనీల్లో లక్షకు పైగా ఉద్యోగాలు

    UPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

    ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 5 సాయంత్రం 6 గంటలు

    దరఖాస్తుల ఉపసంహరణ- 2021 మే 12 నుంచి మే 18

    విద్యార్హతలు- బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి.

    వయస్సు- 2021 ఆగస్ట్ 1 నాటికి 20 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి

    దరఖాస్తు ఫీజు- రూ.200. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు

    ఎంపిక విధానం- రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్

    పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి

    ECIL Recruitment 2021: ఈసీఐఎల్‌లో 111 ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ

    SBI Recruitment 2021: ఎస్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

    UPSC Recruitment 2021: అప్లై చేయండి ఇలా...

    ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    హోమ్ పేజీలో ONLINE APPLICATION FOR VARIOUS EXAMINATIONS OF UPSC పైన క్లిక్ చేయాలి.

    అందులో పార్ట్ 1, పార్ట్ 2 రిజిస్ట్రేషన్ కోసం రెండు లింక్స్ వేర్వేరుగా ఉంటాయి.

    మొదట Click Here for PART I పైన క్లిక్ చేయాలి.

    ఆ తర్వాత నియమనిబంధనలన్నీ చదివి మొదటి పార్ట్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

    ఆ తర్వాత Click Here for Part II పైన క్లిక్ చేసి రెండో పార్ట్ దరఖాస్తు పూర్తి చేయాలి.

    ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

    Published by:Santhosh Kumar S
    First published:April 19, 2021, 15:13 IST