
- News18 Telugu
- Last Updated: April 19, 2021, 18:42 IST
నిరుద్యోగులకు శుభవార్త. ఎన్‌టీపీసీ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో మొత్తం 50 ఖాళీలున్నాయి. ఈ పోస్టులు కేవలం యువతులకు మాత్రమే కేటాయించింది ఎన్‌టీపీసీ లిమిటెడ్. గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్- GATE 2021 స్కోర్ ద్వారా ఈ పోస్టుల భర్తీ జరగనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అప్లై చేయడానికి 2021 మే 6 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ntpccareers.net/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
NTPC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 50
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 22
మెకానికల్ ఇంజనీరింగ్- 14
ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 14
Indian Navy Jobs 2021: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు... ఇంటర్ పాసైతే చాలు
IIT Jobs 2021: ఐఐటీ రూర్కీలో 139 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
NTPC Recruitment 2021: విద్యార్హతల వివరాలు ఇవే...
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. గేట్ 2021 స్కోర్ తప్పనిసరి.
మెకానికల్ ఇంజనీరింగ్- మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, థర్మల్, మెకానికల్ అండ్ ఆటోమేషన్, పవర్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. గేట్ 2021 స్కోర్ తప్పనిసరి.
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. గేట్ 2021 స్కోర్ తప్పనిసరి.
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. గేట్ 2021 స్కోర్ తప్పనిసరి.
UPSC Recruitment 2021: కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
IT Jobs 2021: ఫ్రెషర్స్‌కు జాబ్ అలర్ట్... ఐటీ కంపెనీల్లో లక్షకు పైగా ఉద్యోగాలు
NTPC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 6
వయస్సు- 27 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం- గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్- GATE 2021 స్కోర్ ఆధారంగా దరఖాస్తుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు.