Horoscope today: నేటి రాశి ఫలాలు... ఈ రాశులవారికి శుభవార్తా శ్రవణం

Horoscope Telugu: గ్రహాలు, నక్షత్రాలు, తిథుల ఆధారంగా రాశిఫలాలు నిర్దేశితం అవుతాయి. మార్చి 30, 2021 నాడు... ఏ రాశి వారికి ఎలాంటి ఫలాలు ఉన్నాయో చూద్దాం.

Horoscope today: నేటి రాశి ఫలాలు... ఈ రాశులవారికి శుభవార్తా శ్రవణం

    \1\6Horoscope 30-3-2021: మీ రాశి ఆధారంగా మీకు ఇవాళ ఎలా ఉంటుందో తెలిస్తే... ఏదైనా సమస్య తలెత్తే ప్రమాదం ఉంటే... ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా డబ్బు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అసలే కరోనా కాలం. చేతిలో ఉన్న డబ్బును జాగ్రత్తగా వాడుకోవాల్సిన రోజులు. మరి రాశి ఫలాలు మన నేటి భవిష్యత్తును ఎలా డిసైడ్ చేస్తున్నాయో తెలుసుకుందాం. అంతా మంచిగా ఉంటే ఏ సమస్యా లేనట్లే. ఏవైనా హెచ్చరికలు ఉంటే తదనుగుణంగా నడుచుకోవచ్చు. తెలుగు పంచాంగం, తిథి, నక్షత్రాలు, గ్రహ బలాలు వంటి అన్ని అంశాలనూ లెక్కలోకి తీసుకొని... అత్యంత జాగ్రత్తగా పండితులు సూచించిన నేటి రాశిఫలాలను తెలుసుకుందాం.

    తుల రాశి (Libra)

    ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్నేహితురాలితో కలిసి విందులో పాల్గొంటారు.

    మకర రాశి (Capricorn)

    ఆదాయానికి, ఉద్యోగానికి ఢోకా లేదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభవార్త వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలికి విందు ఇస్తారు. హామీలు ఉండవద్దు.

    సింహ రాశి (Leo)

    ఆదాయానికి, ఉద్యోగానికి సమస్య లేదు కానీ, పెళ్లి ప్రయత్నాలు మాత్రం ముందుకు వెళ్లవు. తలచిన పనులు నెరవేరుతాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌ వారికి బాగుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలు మీతో బిజీ అయిపోతుంది.

    మీన రాశి (Pisces)

    ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులు ఆప్యాయంగా పలకరిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితురాలితో సరదాగా షికార్లు చేస్తారు.

    మిథున రాశి (Gemini)

    ఉద్యోగంలో అధికారు నుంచి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేస్తారు.

    వృశ్చిక రాశి (Scorpio)

    ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కలిసిరావు. పెళ్లి ప్రయత్నాలు కూడా అంతగా అనుకూలంగా ఉండవు. అనవసర ప్రయాణాల మీద ఖర్చవుతుంది. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. స్నేహితురాలితో వాదనకు దిగవద్దు. విద్యార్థులకు పరవాలేదు.

    కుంభ రాశి (Aquarius)

    ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.

    మేష రాశి (Aries)

    ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆదాయం పరవాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి బంధువు మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. ఎవరికీ అప్పు ఇవ్వొద్దు.

    కన్య రాశి (Virgo)

    అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. కామర్స్‌ విద్యార్థులకు సమయం బాగుంది. స్నేహితురాలితో సరదాగా కాలక్షేపం చేస్తారు.

    కర్కాటక రాశి (Cancer)

    ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలకు వెళ్తారు. జీవిత భాగస్వామితో వాదనకు దిగవద్దు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో కాలక్షేపం చేస్తారు.

    వృషభ రాశి (Taurus)

    ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు జరుపుతారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. స్నేహితురాలితో విహార యాత్ర చేస్తారు. విద్యార్థులకు బాగుంది.

    ఇది కూడా చదవండి: House Cool Plants: ఇంటి లోపల ఈ 11 మొక్కలు పెంచండి... వేసవి వేడిని తగ్గించుకోండి

    ధనస్సు రాశి (Sagittarius)

    ఉద్యోగం మారాలనే ప్రయత్నం ఫలిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్నేహితురాలితో సరదాగా తిరుగుతారు. ఆరోగ్యం జాగ్రత్త.

    Published by:Krishna Kumar N
    First published:March 30, 2021, 07:44 IST