
- News18 Telugu
- Last Updated: April 07, 2021, 07:44 IST
\1\6Horoscope today: ఈమధ్య రాశి ఫలాల్లో మార్పులు వేగంగా వస్తున్నాయి. ఏ రాశి వారికీ పూర్తి అనుకూలంగా లేదా పూర్తి వ్యతిరేకంగా ఉండకుండా గ్రహాలు ఫలాలను వారం వారం మార్చేస్తున్నాయి. జ్యోతిష పండితులు తిథి, నక్షత్రం, పంచాంగం, గ్రహాలు, సూర్యుడు, ఘడియలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని... ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో రోజువారీ లెక్కలు వేసి కచ్చితత్వంతో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరి 7-4-2021 నాడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి (Aries)
సమయం బాగుంది. ఆదాయం పరవాలేదు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. వృత్తిలో రాణిస్తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.
వృషభ రాశి (Taurus)
ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు జరుపుతారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. స్నేహితురాలితో విహార యాత్ర చేస్తారు. విద్యార్థులకు బాగుంది.
మిథున రాశి (Gemini)
ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేస్తారు.
కర్కాటక రాశి (Cancer)
ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలకు వెళ్తారు. జీవిత భాగస్వామితో వాదనకు దిగవద్దు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో కాలక్షేపం చేస్తారు.
సింహ రాశి (Leo)
ఆదాయానికి, ఉద్యోగానికి సమస్య లేదు కానీ, పెళ్లి ప్రయత్నాలు ముందుకు వెళ్లవు. తలచిన పనులు నెరవేరుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి బాగుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలు మీతో బిజీ అయిపోతుంది.
కన్య రాశి (Virgo)
అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. కామర్స్ విద్యార్థులకు సమయం బాగుంది. స్నేహితురాలితో సరదాగా కాలక్షేపం చేస్తారు.
తుల రాశి (Libra)
ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఇల్లు కొనాలన్న ఆలోచన చేస్తారు. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్నేహితురాలితో కలిసి విందులో పాల్గొంటారు.
వృశ్చిక రాశి (Scorpio)
ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నం ఫలించదు. పెళ్లి ప్రయత్నాలు కూడా అంతగా అనుకూలంగా ఉండవు. అనవసర ప్రయాణాల మీద బాగా ఖర్చవుతుంది. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. విద్యార్థులకు పరవాలేదు.
ధనస్సు రాశి (Sagittarius)
ఉద్యోగం మానే ప్రయత్నం ఫలిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్నేహితురాలితో సరదాగా తిరుగుతారు. ఆరోగ్యం జాగ్రత్త.
మకర రాశి (Capricorn)
ఆదాయానికి, ఉద్యోగానికి ఢోకా లేదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభవార్త వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలికి విందు ఇస్తారు. హామీలు ఉండవద్దు.
కుంభ రాశి (Aquarius)
ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.
ఇది కూడా చదవండి: Guava Leaves Tea: జామ ఆకుల టీ తాగండి... ఈజీగా అధిక బరువు తగ్గించుకోండి
మీన రాశి (Pisces)
ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులు ఆప్యాయంగా పలకరిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితురాలితో సరదాగా షికార్లు చేస్తారు.