Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం

Horoscope today: ఏప్రిల్ 9 రాశి ఫలాలు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి రాశి ఫలాలను ఇక్కడ చూడండి.

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం

    Horoscope Today:

    ఏప్రిల్ 9 (శుక్రవారం) రాశి ఫలాలు. 12 రాశుల వారికి ఇవాళ ఎలా గడుస్తుంది? గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా? ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? ఆ వివరాలను ఇక్కడ చూడండి.

    మేషం (అశ్విని, భరణి, క త్తిక 1)

    మీ ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతున్నా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. మిత్రుకు చేసే సహాయం వల్ల మేలు జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సమస్య పరిష్కారమయ్యే సూచనలున్నాయి.

    వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

    ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో ఇబ్బందు తప్పకపోవచ్చు. గృహ, వాహనయోగాలున్నాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఒక శుభవార్త ఉత్సాహానిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది.

    మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర , పునర్వసు 1,2,3)

    కాలం ప్రతికూలంగా ఉన్నట్లు కనిపించినా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అధికారులు అదనపు బాధ్యత అప్పగిస్తారు. ఖర్చుకు కళ్లెం వేయండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభం జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

    కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

    అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత శ్రమ పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం ఉంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ఆర్థికంగా వృద్ధికి అవకాశం ఉంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి.

    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

    ప్రతి పనికీ శ్రమ, మానసిక ఒత్తిడి తప్పవు. ఉద్యోగంలో మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. వ్యాపారం నిలకడగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సమస్య పరిష్కారంలో అవరోధాలు తొలగుతాయి. నూతన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు.

    కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

    అనుకున్న పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. వ్యాపారంలో మరింత శ్రద్ధ అవసరం. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం పరవా లేదు.

    తులా (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

    వ్యాపారంలో కలిసి వస్తుంది. అన్ని విధాలా విశేష లాభాలు. ఉద్యోగపరంగా కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. బంధుమిత్రు వల్ల ప్రయోజనం ఉంటుంది. అందదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. పోయిన వస్తువులు తిరిగి వస్తాయి. బంధువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

    వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

    గట్టి పట్టుదతో పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంది. కుటుంబంలో ఒక కీలక సమస్య నుంచి బయటపడతారు. ఆదాయం పెంచుకోవడానికి అనుకూలమైన కాలం ఇది. కుటుంబపరంగా మేలు జరుగుతుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

    ధనుస్సు (మూల, పూర్వాషాడ, ఉత్తరాషాఢ 1)

    అన్ని విధాలా కలసి వచ్చే కాలం. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థికంగా ముందడుగు వేస్తారు.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కని అవకాశాలు అందివస్తాయి. అధికారులను ప్రతిభతో ఆకట్టుకుంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. దూర ప్రాంతంలో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

    మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

    ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో సమస్య ఎదురైనా తెలివిగా పరిష్కరించుకుంటారు. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. మీరు కోరుకున్న చోట ఉద్యోగం లభించే సూచనలున్నాయి. స్నేహితులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

    కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

    ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి జరుగుతుంది. ఇంటా బయటా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌ రావచ్చు. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తి చేస్తారు. కొత్త ప్రయత్నాలు చేపట్టవచ్చు. మిత్రులకు సహాయం చేస్తారు. అంతా శుభమే జరుగుతుంది. ఆరోగ్యం పరవా లేదు.

    మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తం భాద్ర, రేవతి)

    వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. ఆదాయం పరవా లేదు. కానీ, ఖర్చు పెరగకుండా జాగ్రత్త పడాలి. కొద్దిగా ఆలస్యంగా అయిన మీ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రతిభా పాటవాలతో అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. కోరికలు నెరవేరుత యి. ఆరోగ్యం చాలావరకు పరవా లేదు.

    Published by:Shiva Kumar Addula
    First published:April 09, 2021, 09:38 IST