
- News18 Telugu
- Last Updated: April 03, 2021, 07:13 IST
\1\6Horoscope today: గ్రహాల కదలికలు, నక్షత్రాలు, తిథులు, కాలం వంటి అంశాల ఆధారంగా రాశి ఫలాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. గ్రహాలు ఏ రాశి క్షేత్రంలో తిరుగుతున్నాయో దాని ఆధారంగా... జ్యోతిష పండితులు ఆయా రాశులవారి జ్యోతిష్యాన్ని చెబుతున్నారు. అన్నీ మంచి శకునాలే ఉంటే... ఎలాంటి సమస్యా లేనట్లే. అదే చెడు సంకేతాలు ఉంటే... తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. కరోనా సమయం కాబట్టి ఆర్థిక అంశాల్లో, డబ్బు విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మరి 3-4-2001 నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో... పండితులు ఎలాంటి పంచాంగం చెబుతున్నారో తెలుసుకుందాం.
మేష రాశి (Aries)
వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తోంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఇంటి సమస్యల పరిష్కారంలో సొంత నిర్ణయాలతో పాటు కుటుంబ సభ్యుల సహాయం కూడా తీసుకోండి. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
వృషభ రాశి (Taurus)
ఉద్యోగంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ధన లాభం ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. తలచిన పనులు పూర్తవుతాయి. కుటుంబం ద్వారా లబ్ధి పొందుతారు.
మిథున రాశి (Gemini)
ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వాదనకు దూరంగా ఉండండి. అష్టమ శని కారణంగా తరచూ అనారోగ్యాలు తప్పకపోవచ్చు. కొంతవరకు శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదు. శరీరానికి విశ్రాంతి అవసరం.
కర్కాటక రాశి (Cancer)
ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. కోర్టు కేసులో నెగ్గుతారు. ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి.
సింహ రాశి (Leo)
ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణ లాభం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి.
కన్య రాశి (Virgo)
ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. కుటుంబ సమస్య పరిష్కారమవుతుంది. సొంత నిర్ణయాలతో ధైర్యంగా ముందడుగు వేయండి. ఆరోగ్యం జాగ్రత్త.
తుల రాశి (Libra)
ఉద్యోగంలో చక్కని ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. ఆరోగ్యం పరవాలేదు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి (Scorpio)
ఉద్యోగపరంగా ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మరింతగా శ్రద్ధ పెంచాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపు చేసుకోవాలి. కొందరికి మీ ద్వారా మేలు జరుగుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.
ధనస్సు రాశి (Sagittarius)
ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, ఇప్పుడు చేసే పనులు సత్ఫలితాలనిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదు. చేస్తున్న ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. అదృష్ట యోగం పట్టబోతోంది. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి.
మకర రాశి (Capricorn)
ఆర్థికంగా కోలుకుంటారు. అప్పుల బాధలకు పరిష్కారం దొరుకుతుంది. ఇబ్బందుల్లో ఉన్న బంధువును ఆదుకుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా శుభయోగం ఉంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు.
కుంభ రాశి (Aquarius)
ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది. ఎవరి విమర్శలూ పట్టించుకోవద్దు. మిమ్మల్ని చూసి అసూయపడేవారు ఉన్నారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు.
ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ రాశుల వారికి పిల్లలంటే అమితమైన ప్రేమ.. మీది ఏ రాశి
మీన రాశి (Pisces)
తలచిన పనులు వెంటనే పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రు వల్ల లాభపడతారు. ఇప్పుడు మంచి పనులు తలపెడితే సత్ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.