
- News18 Telugu
- Last Updated: April 06, 2021, 07:39 IST
\1\6Horoscope 6-4-2021: ప్రపంచం పరిస్థితి బాగోలేదు. ముఖ్యంగా ఇండియాలో ఎన్నో సమస్యలు. ఇలాంటి సమయంలో మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా పోరాడాలి. అదే జీవితం. ఐతే... అలా పోరాడేందుకు రాశిఫలాలు ఒకింత సాయం చేస్తాయి. రాశిఫలాలు మన భవిష్యత్తును ముందే చెబుతాయి. కొన్ని హెచ్చరికలు చేస్తాయి. అప్రమత్తంగా ఉండమంటాయి. అలాంటి హెచ్చరికలతో మనం అలర్ట్ అయ్యి... రాబోయే విపత్తును ఎదుర్కోవచ్చు. ఇందుకు జ్యోతిష పండితులు చెప్పే అంశాలను లెక్కలోకి తీసుకోవచ్చు. మరి తిథి, నక్షత్రం, గ్రహాలు, పంచాంగం వంటి వాటి ఆధారంగా నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి (Aries)
సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. దూర ప్రయాణాలకు ప్రయత్నాలు చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. పొదుపు చర్యలు చేపడతారు.
వృషభ రాశి (Taurus)
ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలకు వెళ్తారు. సహచరులు, సన్నిహితులతో వాదనకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.
మిథున రాశి (Gemini)
సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్నప్పటి స్నేహితులు పలకరిస్తారు. శుభకార్యం తలపెడతారు. సంతానంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. హామీలు ఉండవద్దు.
కర్కాటక రాశి (Cancer)
ఈ రాశి వారికి సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధువులు, స్నేహితులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల మీద బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.
సింహ రాశి (Leo)
పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు వద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహంగా గడుపుతారు.
కన్య రాశి (Virgo)
వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. ఆదాయం మెరుగ్గానే ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. బంధుమిత్రుల రాకపోకలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి.
తుల రాశి (Libra)
ఉద్యోగం విషయంలో సమయం అనుకూలంగా ఉంది. శుభకార్యాలు జరుగుతాయి. విహార యాత్రకు ప్లాన్ వేస్తారు. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. తగాదాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతాయి.
వృశ్చిక రాశి (Scorpio)
ఆదాయానికి కొరత లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. అప్పు తీర్చే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త.
ధనస్సు రాశి (Sagittarius)
ఈ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. శుభకార్యం తలపెడతారు. వివాహ సంబంధాలు కుదరవచ్చు. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.
మకర రాశి (Capricorn)
ఏలిన నాటి శని కారణంగా పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం కుదరవచ్చు. స్నేహితురాలి నుంచి శుభవార్త వింటారు.
కుంభ రాశి (Aquarius)
ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. వివాహ సంబంధం కుదురుతుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ప్రశంసలు లభిస్తాయి.
ఇది కూడా చదివేయండి: Vastu Shastra: ఆర్థిక సమస్యలు వదలట్లేదా... ఈ వస్తువుల్ని ఈశాన్యంలో ఉంచండి
మీన రాశి (Pisces)
మంచి సంస్థ నుంచి ఉద్యోగం ఆఫర్ వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. రెండో ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. చాలావరకు అప్పు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.