
- News18 Telugu
- Last Updated: April 05, 2021, 07:57 IST
\1\6Today Horoscope: రోజులు అంతగా బాలేవు. కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో చేతిలో ఉన్న డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. అలాగే అనుకోని విపత్తులు వస్తే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అందుకు మన తిథి, నక్షత్రం, గ్రహాలు, పంచాగం ఎలాంటి సూచనలు చేస్తున్నాయి. ఎవరికి ఎలాంటి రాశి ఫలాలు ఉన్నాయో తెలుసుకుంటే... తదనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. మానవ సంబంధాల్ని మెరుగు పరచుకోవడం ఈ రోజుల్లో అవసరం. 5-4-2001 నాడు ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో... పండితులు ఎలాంటి సూచనలు చేస్తున్నారో తెలుసుకుందాం.
మేష రాశి (Aries)
ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వాదనకు దిగవద్దు. విద్యార్థులకు ప్రశంసలు లభిస్తాయి.
వృషభ రాశి (Taurus)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి, మంచి సంస్థలో చేరతారు. ఆదాయం పెరుగుతుంది. మరో ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. చాలావరకు అప్పు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. భార్యాపిల్లలతో సరదాగా గడుపుతారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.
మిథున రాశి (Gemini)
అష్టమ శని కారణంగా పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. స్నేహితురాలితో కాలక్షేపం చేస్తారు.
కర్కాటక రాశి (Cancer)
ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. దూరంగా ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. భార్య తరపు బంధువు ఇంటికి వచ్చే సూచనలు ఉన్నాయి. స్నేహితులు సహాయపడతారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.
సింహ రాశి (Leo)
ఆదాయానికి కొరత లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి తరపు బంధువు మరింత సన్నిహితమవుతారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. స్నేహితురాలి మీద ఖర్చయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. మిత్రులతో విందులో పాల్గొంటారు.
కన్య రాశి (Virgo)
మంచి ఉద్యోగం నుంచి ఆఫర్ వస్తుంది. సమయం అనుకూలంగా ఉంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండండి.
తుల రాశి (Libra)
సంతానంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. తలపెట్టిన పనులు ఆలస్యం అవుతాయి. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. కొంత డబ్బు నష్టం జరగవచ్చు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.
వృశ్చిక రాశి (Scorpio)
ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలకు ఇది సరైన సమయం. బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త.
ధనస్సు రాశి (Sagittarius)
ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. బంధువులు, స్నేహితులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.
మకర రాశి (Capricorn)
ఉద్యోగంలో శ్రమ అధికమవుతుంది. సహోద్యోగులు సహకరిస్తారు. ఒక శుభాకార్యం విషయంలో జీవిత భాగస్వామితో చర్చిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం పరవాలేదు. ఆరోగ్యం జాగ్రత్త.
కుంభ రాశి (Aquarius)
ఉద్యోగంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నం ఫలిస్తుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. బాగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేస్తారు.
మీన రాశి (Pisces)
మంచి సంస్థలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇరుగు పొరుగుతో అపార్థాలు తలెత్తుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.