
- News18 Telugu
- Last Updated: March 31, 2021, 07:28 IST
\1\6Horoscope today: గ్రహాలు, తిథి, నక్షత్రం వంటి అంశాల ఆధారంగా రాశి ఫలాలను నిర్దేశిస్తున్నారు జ్యోతిష పండితులు. ఇవి ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. గ్రహాలు ఏ రాశి క్షేత్రంలో తిరుగుతున్నాయో దాని ఆధారంగా... వారి రాశి ఫలాలపై మంచి, చెడు ఫలితాలు ప్రభావం చూపుతాయి. మంచి జరిగే అవకాశం ఉంటే... ఆనందమే. అదే చెడు జరిగే అవకాశం ఉంటే... అప్రమత్తం అవ్వాలి. మానవ సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో అలర్ట్‌గా ఉండాలి. అలా మనల్ని అప్రమత్తం చెయ్యడంలో రాశిఫలాలు ఉపయోగపడతాయి. మరి 31-3-2001 నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో... పండితులు ఎలాంటి పంచాంగం చెబుతున్నారో తెలుసుకుందాం.
వృషభ రాశి (Taurus)
ఆర్థికంగా చాలా బాగుంది. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. కోర్టు కేసుల్లో నెగ్గుతారు. ఆరోగ్యం పరవాలేదు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.
మేష రాశి (Aries)
ఆదాయం, ఆరోగ్యం పరవా లేదు. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. స్నేహితురాలికి బహుమతులు కొనిస్తారు. విద్యార్థులకు బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త. కోర్టు కేసులో విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి (Cancer)
ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. సమయం మీకు అనుకూలంగా ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుమారుడికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం వస్తుంది. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థుకు బాగుంది.
మిథున రాశి (Gemini)
ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. స్వల్పంగా అనారోగ్య బాధలు తప్పదు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి సమయం కాదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. స్నేహితురాలి మీద ఖర్చు చేస్తారు. కోర్టు కేసు వాయిదా పడుతుంది.
కన్య రాశి (Virgo)
బంధువు మీ సలహా తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. లాయర్లకు, రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. స్నేహితురాలితో సరదాగా కాలక్షేపం చేస్తారు.
సింహ రాశి (Leo)
ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయానికి ఢోకా లేదు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు.
వృశ్చిక రాశి (Scorpio)
రియల్ ఎస్టేట్ వారికి, స్వయం ఉపాధి వారికి అనుకూలంగా ఉంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. బంధువుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
తుల రాశి (Libra)
ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. సోదరులతో ఆస్తి తగాదాలు తలెత్తే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదురుతాయి. ప్రేమ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు.
ధనస్సు రాశి (Sagittarius)
ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. బదిలీ అయ్యే అవకాశం ఉంది. రుణ విముక్తులయ్యే ప్రయత్నం చేస్తారు. వివాహ సంబంధాలు కుదురుతాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలకు సమయం కాదు. ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళ్లవు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.
కుంభ రాశి (Aquarius)
ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆదాయం పెరుగుతుంది. అప్పుల వాళ్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. విద్యార్థుకు కొద్దిగా పరవా లేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో విజయం సాధిస్తారు.
మకర రాశి (Capricorn)
ఆదాయం బాగానే ఉంటుంది. అప్పులు తీరుస్తారు. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలకు అవకాశం ఉంది. సహోద్యోగులు సహకరిస్తారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. టీచర్ల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారంలో ఆచితూచి అడుగువేయండి.
మీన రాశి (Pisces)
తలపెట్టిన పనులన్నీ శ్రమ లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌కి అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు చూడడానికి వస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు
పురోగతి సాధిస్తారు. ప్రేమ సఫలమవుతుంది. ఆర్థిక లావాదేవీలు జరపవద్దు.